Gold Price Today : మళ్లీ బంగారం పరుగులు.. మగువలకు షాకింగ్ న్యూస్
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో అంచనాలు వేయడం కష్టంగానే ఉంది. తగ్గినట్లే తగ్గి బంగారం ధరలు పెరుగుతాయి. అలాగే పెరిగినట్లే పెరిగి అమాంతం తగ్గుతాయి. బంగారం ధరల్లో హెచ్చుతగ్గుదలకు అనేక మార్పులు కారణం అని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలతో పాటు ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటివి బంగారం, వెండిధరల్లో హెచ్చు తగ్గుదలకు కారణమని చెబుతుంటారు. అందుకే ఒకరోజు ఉన్న ధరలు మరొక రోజు కనిపించవు. రేపు కొనుగోలు చేద్దామనుకుంటే బంగారం విషయంలో కుదరదు.ఎందుకంటే బాగా పెరగవచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు. తగ్గవచ్చు. అది ఎవరి చేతుల్లో ఉండదు.
కొనుగోళ్లు పెరుగుతాయని...
ఇటీవల కాలంలో బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు ఇంకా తగ్గుతాయని ఆశపడ్డారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లినట్లుగా ధరలు ఉన్నట్లుండి పెరిగిపోయాయి. ధరలు పెరిగిపోవడం కొత్త ఏమీ కాకపోయినా బంగారం, వెండి ధరలు అందుబాటులో లేకుంటే కొనుగోళ్లు తగ్గుతాయని, అమ్మకాలపై ప్రభావం చూపుతాయని వ్యాపారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగినప్పుడల్లా కొనుగోళ్లు తగ్గడం ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తుందని జ్యుయలరీ దుకాణాల వ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ తో పాటు శుభముహూర్తాలున్నప్పటికీ బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
నేటి ధరలు ఇవే...
ఇదే సమయంలో బంగారం ధరలు మరింత పెరుగుతాయని ఎప్పటి నుంచో అంచనాలు వినిపిస్తున్నాయి. మార్కెట్ నిపుణులు కూడా పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా కొనుగోళ్లు మాత్రం ఊపందుకోవడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,610 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,120 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర కూడా 91,600 రూపాయలుగా కొనసాగుతుంది. ఇవి ఉదయం ఆరు గంటల వరకూ ఉన్న ధరలే. మధ్యాహ్నానికి బంగారం, వెండిధరల్లో మార్పులు రావచ్చు.