బ్రేకింగ్ : నిమ్మగడ్డతో భేటీకి ముందే ప్రభుత్వ కీలక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీ, ఎంపీపీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. [more]

;

Update: 2021-01-02 04:55 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీ, ఎంపీపీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరిలో జరపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు సమావేశమై ఎన్నికలపై చర్చించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జడ్పీ, ఎంపీపీల పరిధిలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. మరో ఆరు నెలల పాటు స్పెషల్ ఆఫీసర్ల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News