ఎన్టీఆర్ మనుమరాలికి, ఇందిరమ్మ మనుమడికి ఎన్నికల ప్రచారం చేయం కంటే అద్భుతమైనది ఏమైనా ఉంటుందా అని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన తాజా రాజకీయాలపై మాట్లాడుతూ... అసలుసిసలు రాజకీయం అనే పదానికి స్పెల్లింగ్ నేర్పిన చాణిక్యుడు చంద్రబాబు అని కీర్తించారు. జీవితంలో రాజకీయాలు వేరు, సినిమాలు వేరనే విషయాన్ని తాను స్వర్గీయ ఎన్టీఆర్ వద్ద నేర్చుకున్నానని తెలిపారు. కూకట్ పల్లి నుండి పోటీకి దిగిన సుహాసిని తరుపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ రావలిసిన అవసరం లేదన్నారు.
తన కొడుకుతో సమానం...
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమలో అంచెలంచెలు ఎదుగుతూ వస్తున్నారని, ఇలాంటి సమయంలో ఎన్నికల ప్రచారానికి వస్తే కొంతమంది వ్యతిరేకంగా మారే అవకాశం ఉంద్నారు. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్నికల ప్రచారం అంతగా కలిసి రాలేదని, ఆ భయం తోనే నేను జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి రావద్దని చెప్పానని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తన అన్న కొడుకు మాత్రమే కాదని... తన కొడుకుతో సమానని పేర్కొన్నారు. మోక్షజ్ఞ ఎన్నికల ప్రచారానికి ఎందుకు రాలేదో... జూనియర్ ఎన్టీఆర్ కూడా అందుకే రాలేదన్నారు.