కరీంనగర్ కాదట.. "కరి" నగర్ అట
కరీంనగర్ లో ఈరోజు బండి సం.య్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగియనుంది
కరీంనగర్ లో ఈరోజు బండి సం.య్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగియనుంది. కరీనంగర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కరీంనగర్ పేరును బీజేపీ మార్చేసింది. కరినగర్ గా పేర్కొంటూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
అధికారంలోకి రాగానే...
భారతీయ జనతా పార్టీ ముస్లిం సామాజికవర్గానికి చెందిన నేతల పేర్లు ఉన్న నగరాల పేరు మార్పునకు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్ ను కూడా భాగ్యనగరంగానే వారు పిలుస్తారు. తాము అధికారంలోకి రాగానే ఈ పేర్లన్నింటినీ అధికారికంగా మార్చేస్తామని తరచూ చెబుతుంటారు. యూపీ వంటి రాష్ట్రాల్లో కూడా అనేక నగరాలకు అధికారంలోకి రాగానే పేరు మార్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. సెంటిమెంట్ తో హిందువుల ఓటు బ్యాంకును ఏకం చేసే ప్రయత్నంలో భాగమేనని విపక్షాలు సయితం బీజేపీని విమర్శించినా పెద్దగా ఖాతరు చేయదు.
పత్రికల్లో ప్రకటనలు...
ఇటీవల భైంసాలో తన ఐదో విడత ప్రజాసంగ్రామ పాదయాత్రను ప్రారంభించినప్పుడు కూడా బండి సంజయ్ భైంసా పేరు తాము అధికారంలోకి రాగానే మార్చివేస్తామని ప్రకటించారు. భైంసా పేరును మహీషగా మారుస్తామంటూ ఆయన బహిరంగ సభలో పేర్కొన్నారు. ఇప్పుడు కరీంనగర్ లో కూడా బహిరంగ సభకు జారీ చేసిన ప్రకటనల్లో కరినగర్ గా పేర్కొంటూ పత్రికలకు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ లో ముస్లిం పేరు ఉండటంతో దానిని "కరి"నగర్ గా మార్చేస్తున్నామని చెప్పకనే చెప్పారు. కరి అంటే ఏనుగు అంటారు. బండి సంజయ్ తన ట్విట్టర్ లోనూ కరినగర్ గానే పేర్కొంటారు. బీజేపీ నేతలు పలికేది కూడా కరినగర్ గానే పిలుస్తారు. ఇలా కరీంనగర్ ను కరినగర్ గా పేర్కొంటూ పత్రికల్లో ప్రకటనలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.