బ్రేకింగ్ : రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు.. ఏపీలో

బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలన్నారు. ఒక్క రాజధాని [more]

;

Update: 2020-08-11 06:43 GMT

బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలన్నారు. ఒక్క రాజధాని అవినీతిపై ఎలా పోరాడామో, మూడు రాజధానుల అవినీతిపైనా పోరాడాలన్నారు. మంచిని మాత్రం మంచిగా చూడాలన్నారు. మంచి చేస్తే అంగీకరించాలని, తప్పు చేస్తే మాట్లాడాలని రామ్ మాధవ్ తెలిపారు. దేశంలో మూడు రాజధానులు ఎక్కడా లేవన్నారు. యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలోనూ ఒకే రాజధాని ఉందన్నారు రామ్ మాధవ్. కన్నా ను తీసేశారని, సోము వీర్రాజును పెట్టారని అనుకోవద్దని చెప్పారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. బీజేపీ రాజకీయాలు వంశపారంపర్య, స్వార్థ, పదవీ రాజకీయాలు కావన్నారు. అధికార పార్టీని ఒక్క మాట అంటేనే విరుచుకుపడుతున్నారన్నారు. ఏపీలో అధికారంలోకి రావాలంటే అంత సులభం కాదన్నారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని రామ్ మాధవ్ తెలిపారు.

Tags:    

Similar News