అమరావతిని అలా డెవలెప్ చేస్తాం

అమరావతి రైతులకు న్యాయం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం చెప్పినట్లే రైతులకు అభివృద్ధి చేసి ప్లాట్లను ఇస్తామని బొత్స తెలిపారు. అమరావతిని ఎడ్యుకేషనల్ [more]

Update: 2019-12-20 14:23 GMT

అమరావతి రైతులకు న్యాయం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం చెప్పినట్లే రైతులకు అభివృద్ధి చేసి ప్లాట్లను ఇస్తామని బొత్స తెలిపారు. అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఒక్క అమరావతిలోనే అన్నీ పెడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని బొత్స తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్షాలకు తాము జవాబుదారీ కాదని ప్రజలకు మాత్రమే అని ఆయన తెలిపారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై ఈ నెల 27వ తేదీన మంత్రివర్గ సమావేశంలో చర్చించామన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ తో వేలాది ఎకరాల భూములను కొందరు టీడీపీ నేతలు కొనుగోలు చేశారన్నారు. కొందరు రైతులను రెచ్చగొట్టి తప్పుడు ప్రచారానికి దిగుతున్నారన్నారు.

Tags:    

Similar News