రాజధాని రైతులకు న్యాయం చేస్తాం

రాజధాని రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని, ఈ విషయం త్వరలోనే తెలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధాని రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం చేయబోమని [more]

Update: 2019-12-26 14:18 GMT

రాజధాని రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని, ఈ విషయం త్వరలోనే తెలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధాని రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం చేయబోమని ఆయన తెలిపారు. కేవలం అమరావతి నుంచి సచివాలయం ఒక్కటి మాత్రమే తరలి పోతుందని, దాని వల్ల అమరావతికి నష్టం ఏమీ లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతిలో ఒక్క శాతం పనులను కూడా చంద్రబాబు చేయలేదని చెప్పారు. చంద్రబాబు ట్రాప్ లో రాజధాని రైతులు పడవద్దని బొత్స సూచించారు. ఏ ప్రాంతాన్ని గత ఐదేళ్లలో అభివృద్ధి చేయకుండా చంద్రబాబు డ్రామాలాడారన్నారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Tags:    

Similar News