భారీ మూల్యం తప్పదు

పెయిడ్ ఆర్టిస్టులతో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే ఊరుకునేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీని హెచ్చరించారు. చలో ఆత్మకూరు పేరుతో ఆందోళనలు చేసి సమస్యలను సృష్టించాలని [more]

Update: 2019-09-10 14:17 GMT

పెయిడ్ ఆర్టిస్టులతో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే ఊరుకునేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీని హెచ్చరించారు. చలో ఆత్మకూరు పేరుతో ఆందోళనలు చేసి సమస్యలను సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. గతంలో తాను యరపతినేని శ్రీనివాసరావు అక్రమ క్వారీలను పరిశీలించడానికి వెళితే అరెస్ట్ చేయలేదా? అని ప్రశ్నించారు. యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాదరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ లు తప్పు చేయలేదని అంగీకరిస్తారా? అని చంద్రబాబును నిలదీశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.రేపు టీడీపీ చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News