సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదు

శాసన మండలి లో ఇంకా సెలెక్ట్ కమిటీ ప్రక్రియ పూర్తి కాలేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చైర్మన్ సభలో ప్రకటన చేసి వెళ్లిపోయారని, దానిపై స్పష్టంగా [more]

Update: 2020-02-07 11:46 GMT

శాసన మండలి లో ఇంకా సెలెక్ట్ కమిటీ ప్రక్రియ పూర్తి కాలేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చైర్మన్ సభలో ప్రకటన చేసి వెళ్లిపోయారని, దానిపై స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వలేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. మిలీనియం టవర్స్ నుంచి ఏ ఐటీ కంపెనీల ను తరలించలేదని బొత్స తెలిపారు. టీడీపీ నేతలు పార్లమెంట్ సాక్షిగా అలాంటి ప్రకటన లు చేయడం రాష్ట్రానికి నష్టం చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ లో ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసిన నాటి నుంచే వికేంద్రీకరణ ప్రక్రియ కొనసాగుతోందని బొత్స తెలిపారు. న్యాయ పరంగా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చని, అయితే తమ విధానం ప్రకారం ప్రభుత్వం వ్యవహరిస్తోందని బొత్స చెప్పారు. రాజ్యాంగనికి, చట్టానికి లోబడే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. తరలింపు పై ప్రజలు, ఉద్యోగుల అంతా సంతోషంగా నే ఉన్నారన్నారు.

Tags:    

Similar News