Botsa : టీడీపీని నిషేధించాలని కోరబోతున్నాం

టీడీపీ పై నిషేధం విధించాలని ఎన్నికల కమిషన్ ను కోరతామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఇంకా మానుకోలేదన్నారు. కావాలనే రెచ్చగొట్టే తీరులో [more]

;

Update: 2021-10-20 06:39 GMT

టీడీపీ పై నిషేధం విధించాలని ఎన్నికల కమిషన్ ను కోరతామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఇంకా మానుకోలేదన్నారు. కావాలనే రెచ్చగొట్టే తీరులో నేతలను మాట్లాడేలా ప్రోత్సహిస్తున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు తగవని ఆయన సూచించారు. టీడీపీని నిషేధించాలని కోరుతామన్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని తూలనాడటం తగదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా టీడీపీ వ్యవహరిస్తుందని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News