రాజధానిపై తుదినిర్ణయం అప్పుడే

సెక్రటేరియట్ తరలించినంత మాత్రాన అభివృద్ధి ఎలా జరుగుతుందని చంద్రబాబు అంటున్నారని, మరి అమరావతిలో సెక్రటేరియట్ ఉన్నా అభివృద్ధి జరగదు కదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. [more]

Update: 2019-12-23 13:12 GMT

సెక్రటేరియట్ తరలించినంత మాత్రాన అభివృద్ధి ఎలా జరుగుతుందని చంద్రబాబు అంటున్నారని, మరి అమరావతిలో సెక్రటేరియట్ ఉన్నా అభివృద్ధి జరగదు కదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అమరావతి రైతులు ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి ఇస్తామని తెలిపారు. జీఎన్ రావు నివేదిక కమిటీపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 27వ తేదీన తుది నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు. విజయవాడలో నోవాటెల్ హోటల్ కు దోచి పెట్టారు తప్ప ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? అని బొత్స ప్రశ్నించారు. ఒక సామాజికవర్గానికి చెందిన పెయిడ్ ఆర్టిస్టులతో తమను తిట్టిస్తున్నారన్నారు. రైతులు సంయమనం పాటించాలని బొత్స కోరారు. ఐదేళ్లలో చంద్రబాబు దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించారన్నారు బొత్స. హెరిటేజ్ కు, బాలకృష్ణ వియంకుడికి భూములు దోచిపెట్టింది నిజంకాదా? అని బొత్స ప్రశ్నించారు. రాజధాని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతులు తమ ఆందోళనలు విరమించుకోవాలన్నారు.

Tags:    

Similar News