ఆ డబ్బు మురళీమోహన్ దే.. కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీమోహన్ పై సైబరాబాద్ లో కేసు నమోదైంది. మురళీమోహన్ తో [more]

Update: 2019-04-04 08:19 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీమోహన్ పై సైబరాబాద్ లో కేసు నమోదైంది. మురళీమోహన్ తో పాటు ఆయనకు చెందిన జయభేరీ సంస్థలో పనిచేస్తున్న నిమ్మలూరి శ్రీహరి, పండరీ, ధర్మరాజు, జగన్మోహన్ రావు, యలమంచిలీ మోహన్ కృష్ణ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నిన్న సాయంత్రం హైటెక్ సిటీ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తమకు కనిపించారని, వారిని విచారించగా రూ.2 కోట్ల డబ్బు దొరికిందని తెలిపారు. ఈ డబ్బును ఎన్నికల్లో పంచడానికి రాజమండ్రి తరలిస్తున్నట్లు, ఎంపీ మురళీమోహన్ కు ఇవ్వనున్నట్లు వారు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ట్రైన్ లో డబ్బు తరలించేందుకు ప్రయత్నించారని తెలిపారు. మురళీమోహన్ కోడలు మాగంటి రూప రాజమండ్రి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ ఆరంఘర్ లో ఏపీ మంత్రి పరిటాల సునీత అనుచరుడు దగ్గుబాటి ప్రసాద్ డ్రైవర్ సంతోష్ వద్ద రూ.25 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ డబ్బును కూడా ఎన్నికల్లో పంచడానికి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News