Huzurabad : కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం.. దళిత బంధుకు బ్రేక్
కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో దళిత బంధు పథకాన్ని నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. దళిత [more]
;
కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో దళిత బంధు పథకాన్ని నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. దళిత [more]
కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో దళిత బంధు పథకాన్ని నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. దళిత బందు పథకం అమలు నిలిపేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ఈ స్కీమ్ ను ఆపేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ అందింది. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు….
అయితే దళిత బంధు పథకంపై కొందరు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దళిత బంధు పథకంతో పాటు కొత్తగా రేషన్ కార్డులు, పింఛన్లు కూడా మంజూరు చేయవద్దని ఎన్నికల కమిషన్ సూచించింది. దళిత బంధు పథకాన్ని వెంటనే నిలిపేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ పథకం వచ్చే నెల మొదటి వారం వరకూ ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.