అన్న‌గా జ‌గ‌న్ ను అంగీక‌రించ‌రు

అన్న వ‌స్తున్నాడు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ చేప‌డుతున్న ప్ర‌చారంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. గురువారం పార్టీ నేత‌ల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన ఆయ‌న‌… జ‌గ‌న్ విష‌యాన్ని [more]

Update: 2019-02-07 05:58 GMT

అన్న వ‌స్తున్నాడు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ చేప‌డుతున్న ప్ర‌చారంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. గురువారం పార్టీ నేత‌ల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన ఆయ‌న‌… జ‌గ‌న్ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. జ‌గ‌న్ కు నేర‌స్థుడిగా ఉండ‌ట‌మే తెలుస‌ని, అన్న‌గా ఉండ‌టం తెలియ‌ద‌న్నారు. జ‌గ‌న్ ను అన్న‌గా మ‌హిళ‌లు ఎవ‌రూ అంగీక‌రించే ప‌రిస్థితి లేద‌న్నారు. టీడీపీ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌తో వైసీపీ నేత‌లకు దిక్కుతోచ‌డం లేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. అందుకే రూ.3 వేలు పింఛ‌న్ అంటున్నార‌ని పేర్కొన్నారు. జ‌గ‌న్ ను ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు.

 

Tags:    

Similar News