వెంటనే శ్వేతపత్రం విడుదల చేయండి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణ, ప్రస్తుత [more]

;

Update: 2021-05-12 01:16 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణ, ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్యపై నిజాలు చెప్పాలని చంద్రబాబు కోరారు. వ్యాక్సిన్ అందరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. కరోనా మృతుల దహన సంస్కారాలకు పదిహేను వేల రూపాయాలు ప్రభుత్వం ఇవ్వాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News