Chandrababu : కుప్పం నుంచి బాబు సవాల్ ఇదే

కుప్పం ప్రజలను తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోయిందన్నారు. పోలీసుల సాయంతో పార్టీ కార్యాలయాలపై [more]

Update: 2021-10-29 12:52 GMT

కుప్పం ప్రజలను తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోయిందన్నారు. పోలీసుల సాయంతో పార్టీ కార్యాలయాలపై దాడికి దిగే నీచ సంస్కృతికి తెరలేపారని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు కుప్పం బహిరంగ సభలో ప్రసంగించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అయినా భయపడేది లేదని, అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

వడ్డీతో సహా చెల్లిస్తా….

పోలీసులు కూడా తమ పరిధిని దాటి వ్యవహరిస్తే ఏం జరుగుతుందనేది భవిష్యత్ లో చూస్తారని చంద్రబాబు అన్నారు. తాము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు. వైసీపీ అరాచకాలపై ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి వచ్చానని, రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తుందని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై మేధావులు కూడా బయటకు వచ్చి స్పందించాలని కోరారు.

Tags:    

Similar News