క్షమాపణ చెప్పేందుకు సిద్ధం

అమరావతి ప్రజారాజధాని అని దానిని కాపాడుకునేందుకు అందరూ చైతన్యవంతులు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి విషయంలో [more]

Update: 2019-12-05 09:16 GMT

అమరావతి ప్రజారాజధాని అని దానిని కాపాడుకునేందుకు అందరూ చైతన్యవంతులు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి విషయంలో తాను తప్పు చేసినట్లు ప్రజలు అభిప్రాయపడితే తాను క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని అవసరమని చెప్పారు. ప్రజలు వద్దనుకుంటే రాజధానిపై ఎలాంటి ఉద్యమం చేయాల్సిన అవసరం లేదన్నారు. కానీ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ప్రభుత్వం కొనసాగించాల్సిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమరావతిపై లేనిపోని అపోహలు సృష్టించారన్నారు. వ్యక్తులు, పార్టీలు శాశ్వతం కాదని, సమాజం, రాష్ట్రం శాశ్వతమని చంద్రబాబు తెలిపారు. అమరాతి ప్రాజెక్టు తప్పు అని ఎవరైనా అంటే క్షమాపణ చెబుతానని అన్నారు. అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రజా చైతన్యం వల్లనే అమరావతి నిలబడుతుందన్నారు.

Tags:    

Similar News