మద్యం దుకాణాలు ఆరు గంటలకే తెరుస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నా మద్యం దుకాణాలను ఆరు గంటలకే [more]

;

Update: 2021-05-06 01:08 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నా మద్యం దుకాణాలను ఆరు గంటలకే తెరుస్తారా? అని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ విషయంలోనూ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని చంద్రబాబు ఆరోపించారు. కేబినెట్ సమావేశంలో జగన్ కనీసం కరోనాపై చర్చించలేదన్నారు. బాధ్యతతోనే తము పొలిట్ బ్యూరో మీటింగ్ పెట్టి చర్చించామని చంద్రబాబు తెలిపారు. ఆర్థికంగా చితికి పోయిన వారిని జగన్ ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News