చంద్రబాబు అసెంబ్లీకి గైర్హాజరవుతారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై సందేహాలు నెలకొన్నాయి. ఈనెల 20వ తేదీన ఒకోరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కరోనా [more]

;

Update: 2021-05-13 01:20 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై సందేహాలు నెలకొన్నాయి. ఈనెల 20వ తేదీన ఒకోరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారు. ఒకరోజు అసెంబ్లీ సమావేశాల కోసం అమరావతికి ఎందుకు రావడమని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఒకరోజు అసెంబ్లీ సమావేశాల్లో కేవలం బడ్జెట్ ఆమోదం కోసమే కావడంతో తాను హాజరైనా ప్రయోజనం ఉండదని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశానికి చంద్రబాబు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Tags:    

Similar News