కుప్పంపై చంద్రబాబు…?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో కరోనాను నియంత్రించేందుకు సిద్ధమయ్యారు. ఆ నియోజకవర్గ ఎమ్యెల్యేగా కరోనా నియంత్రణ కోసం పలు అభివృద్ధి పనులను ఆయన చేపట్టనున్నారు. [more]

;

Update: 2021-05-15 01:22 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో కరోనాను నియంత్రించేందుకు సిద్ధమయ్యారు. ఆ నియోజకవర్గ ఎమ్యెల్యేగా కరోనా నియంత్రణ కోసం పలు అభివృద్ధి పనులను ఆయన చేపట్టనున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య సదుపాయాలతో పాటు సిబ్బంది కొరతను తీర్చాాలని, అందుకయ్యే మొత్తం ఖర్చును తాను భరిస్తానని చంద్రబాబు చెప్పారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో 35 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చంద్రబాబు సొంత నిధులను వెచ్చించనున్నారు. సిబ్బంది నియామకం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ద్వారా చేపట్టాలని చంద్రబాబు నేతలకు సూచించారు.

Tags:    

Similar News