ఎంపీపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా?

రఘురామ కృష్ణంరాజుపై ఏపీ సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పపట్టారు. ఆయన ప్రాణాలకు ముప్పుఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఎంపీపై [more]

;

Update: 2021-05-16 01:45 GMT

రఘురామ కృష్ణంరాజుపై ఏపీ సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పపట్టారు. ఆయన ప్రాణాలకు ముప్పుఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఎంపీపై పోలీసులు ఇలా అరాచకంగా వ్యవహరిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వాదులందరూ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ను ఖండించాలన్నారు. రఘురామ కృష్ణంరాజు ప్రాణాలకు ముప్పు ఏర్పడితే ప్రభుత్వానిదే బాధ్యత అని చంద్రబాబు హెచ్చరించారు. ఆయనను కొట్టడం పోలీసుల దమనకాండకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. రఘురామ కృష్ణంరాజు సీఐడీ పెట్టిన అక్రమ కేసుల్లో నిందితుడు మాత్రమేనని అన్నారు. సామాన్య పౌరుడినైనా పోలీసులు కొట్టడం దుర్మార్గమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News