దేశం గతి మార్చడానికి పిడికిలి బిగిస్తా

పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీకి గులాములుగా ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను కాకుండా పోరాటం చేయగలిగే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. మంగళవారం భువనగిరిలో జరిగిన ఎన్నికల [more]

Update: 2019-04-02 14:23 GMT

పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీకి గులాములుగా ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను కాకుండా పోరాటం చేయగలిగే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. మంగళవారం భువనగిరిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుగా ఉంటారని, తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లడలేరని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే కొట్లాడి కావాల్సినవి సాధిస్తారని అన్నారు. 66 ఏళ్లు పాలించి దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ నాశనం చేసిందన్నారు. దేశం గతి మార్చడానికి పిడికిలి బిగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రజలు తనను దీవించాలన్నారు. మనకంటే తక్కువ ఆదాయం, తక్కువ వ్యవసాయ భూమి ఉన్న చైనా ఇవాళ ప్రపంచంలోనే రెండో బలమైన దేశంగా ఉందని, మనం ఎందుకు వెనుకబడ్డామని ప్రశ్నించారు. దేశం దరిద్రం పోవాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దరిద్రం పోవాలన్నారు. కేసీఆర్ ఢిల్లీ వస్తారేమోనని బీజేపీ, కాంగ్రెస్ భయపడుతున్నాయని, పీఠాలు వణికిపోతున్నాయని పేర్కొన్నారు.

Tags:    

Similar News