జగన్ దే జయం… సీఎన్ఎన్ న్యూస్ 18 సర్వే

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని సీఎన్ఎన్ న్యూస్ 18 ఛానల్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలో తేలింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ [more]

Update: 2019-05-19 13:18 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని సీఎన్ఎన్ న్యూస్ 18 ఛానల్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలో తేలింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 14 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 10 నుంచి 12 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యంలో ఉంది.

తెలంగాణలో టీఆర్ఎస్ విజయం

తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ పార్టీ హవా ఉండనున్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. టీఆర్ఎస్ 12 నుంచి 14 స్థానాలు, బీజేపీ 1 నుంచి 2 స్థానాలు, కాంగ్రెస్ 1 నుంచి 2 స్థానాలు, ఎంఐఎం పార్టీకి ఒక సీటు సాధిస్తుందని తేల్చింది.

Tags:    

Similar News