యూపీలో కాంగ్రెస్ రెండు స్థానాలకే...?
యూపీ ఎన్నికల కౌంటింగ్ దాదాపు ముగిసింది. బీజేపీ 268 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వరసగా రెండో సారి వచ్చింది
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ దాదాపు ముగిసింది. బీజేపీ 268 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వరసగా రెండో సారి వచ్చింది. 35 ఏళ్ల యూపీ రాజకీయ చరిత్రలో రెండోసారి వరసగా అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించింది. ఇక సమాజ్ వాదీ పార్టీ 130 స్థానాలకు పరిమితమయింది. అతి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికల పడింది.
బీఎస్పీ ఒక స్థానంలో...
కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. కాంగ్రెస్ ఇంత దారుణంగా ఓటమి పాలుకావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. గెలిచిన వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన అందరికీ రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.