139 మంది రేప్ కేసులో ఎవరీ డాలర్ బాయ్?
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 139 మంది అత్యాచారం కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. ఆడవాళ్లు గురించి , వారికి జరిగిన అన్యాయం గురించి ఉపాన్యాసాలు ఇస్తున్న [more]
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 139 మంది అత్యాచారం కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. ఆడవాళ్లు గురించి , వారికి జరిగిన అన్యాయం గురించి ఉపాన్యాసాలు ఇస్తున్న [more]
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 139 మంది అత్యాచారం కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. ఆడవాళ్లు గురించి , వారికి జరిగిన అన్యాయం గురించి ఉపాన్యాసాలు ఇస్తున్న డాలర్ బాయ్ వ్యహారంలో కూడా కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉద్యోగం కోసం వచ్చిన ఓ అమ్మాయిని ట్రాప్ చేసి , భాదితురాలు సర్టిఫికెట్స్ ను బలవంతంగా లాకొన్ని అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం ఇప్పుడు గుప్పు మంటుంది .. పెళ్ళైన కొన్ని రోజులకే శారీరకంగా , మానసికంగా వేధింపులకు గురిచేయడంతో యువత పోలీసులకు ఫిర్యాదు చేసింది .. ఇక డాలర్ బాయ్ అధీనం లో ఉన్న పంజాగుట్ట కేసు లో బాధితురాలు సైతం ఇప్పుడు తల్లి చెంతకు చేరింది.
ఎందుకు అదుపులోకి తీసుకోలేదు?
139 మంది తనని లైంగిక దాడి చేశారు అంటూ నమోదైన కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి .. ఇప్పటికే ఈ కేసులో భాదితురాలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్నారనే ఆరోపణలు పై పోలీసులు ఎందుకు దృష్టి పెట్టలేక పోతున్నారు .. అసలు ఈ డాలర్ బాయ్ ను ఎందుకు అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేయడం లేదనే సందేహాలు కూడా కలుగుతున్నాయి ..ఇక ఇప్పటి వరకు నాకు పెళ్లి కాలేదని చెప్పుకుంటూ తిరుగుతున్న డాలర్ బాయ్ బాగోతం బయట పడింది.
ట్రాప్ చేసి మరీ బెదిరించి….
అనంతపూర్ జిల్లా కి చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం వస్తే ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు .. ఒరిజినల్ సర్టిఫికేట్ తన దగ్గర పెట్టుకొని బెదిరించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2018 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న కొద్దీ రోజులకే డాలర్ బాయ్ లీలలు బయట పడ్డాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చాలామంది అమ్మాయిలను ట్రాప్ చేయడం , ఆ తరువాత వారిని లోబర్చుకొని , వారి సర్టిఫికేట్లు తీసుకొని వేధింపులకు గురి చేయడం మాములుగా మారింది. ఇక ఇంటికి వెళ్ళగానే భార్యను మానసికంగా , శారీకంగా చిత్ర హింసలకు గురి చేస్తూ సైకో గా ప్రవర్తించే వాడని ఆరోపణలు వస్తున్నాయి.
మూడు లక్షల కోట్లు ఉన్నాయంటూ….
మానసికంగా శారీరకంగా వేధిస్తూ సైకో ఆనందం పొందిన డాలర్ బాయ్, డబ్బులు బంగారం తేవాలంటూ చిత్రహింసలకు గురి చేశాడు .. ఎలాగైనా ఈ సైకో డాలర్ బాయ్ నుండి బయట పడాలని ప్రయత్నం చేయగా , తనని విడిచి వెళ్లి పోతే ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వనని భార్య ను బెదిరింపులకు దిగాడు .. దీంతో ఏమి చేయాలో దిక్కు తోచక ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది .. తనకుకు మూడు లక్షలు కోట్లు ఉన్నాయని , నాకు మూడు కంపనీలు ఉన్నాయని చెపుతూ మాయ చేస్తున్నాడు డాలర్ బాయ్ .. అసలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక బడ్జెట్ లు కలిపితే మూడు లక్షలు కోట్లు , అలాంటిది ఈ డాలర్ బాయ్ కి అంత పెద్ద మొత్తం ఎక్కడ నుండి డబ్బులు వచ్చాయి , డాలర్ బాయ్ ఇన్ కం సోర్స్ ఏంటి ? అనే సమాధానం లేని ప్రశ్న.
కన్సెల్టెన్సీ యాడ్ ఏజెన్సీ పేరుతో…..
మైనింగ్ , స్పీడ్ జెడ్ ప్రయివేటు లిమిటెడ్ , స్పీడ్ జెడ్ మైయిన్స్ అండ్ రీసర్చ్ ప్రయివేటు లిమిటెడ్ ఈ మూడు కంపనీలు ద్వారా నా ఆస్తి మూడు లక్షలు కోట్లు అని చెపుతున్నాడు .. ఒక్కో షేర్ కోటి రూపాయలు విలువ అని ఊహకు అందని మాటలు మాట్లాడుతు మభ్య పెడుతున్న డాలర్ బాయ్ డాలర్ లీలలు అన్ని ఇన్ని కాదు .. ప్రపంచం లో ఏ కంపనీకి లేని షేర్ వేల్యూ డాలర్ బాయ్ కి ఎలా వచ్చింది అని అందరు ముక్కున వేలు వేసుకుంటున్నారు. కన్సల్టెన్సీ యాడ్ ఎజే జెన్సి పేర్లతో పలువురికి ఉద్యోగాల ఆశ చూపి వారి సర్టిఫికెట్లను తన వద్ద పెట్టుకొని బ్లాక్ మెయిల్ కి పాల్పడే వాడని ఒక్కో విషయం బయట పడుతూ వస్తుంది. అయితే డాలర్ బాయ్ బాధితులు ఇంకెంత మంది ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు నిఘా పెట్టారు .. ఇప్పుడు పంజాగుట్ట కేసులో బాధితురాలను సైతం అలాగే ట్రాప్ చేసి అమ్మాయిని బెదిరింపులకు దిగాడనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో మరికొన్ని విషయాలు కూడా బయటే పడే అవకాశం ఉంది ..