వచ్చే నెల నుంచి తెలంగాణాలో విద్యాసంస్థలు
తెలంగాణలో విద్యాసంస్థలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నెల నుంచి [more]
;
తెలంగాణలో విద్యాసంస్థలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నెల నుంచి [more]
తెలంగాణలో విద్యాసంస్థలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నెల నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు మూతబడ్డాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి విద్యాసంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 9వ తరగతి నుంచి డిగ్రీ, ఇంజినీరంగ్ కళాశాలలు వచ్చే నెల 1వ తేదీ నుంచి తెరిచేందుకు ప్రభుత్వ అనుమతించింది. కరోనా నిబంధనలను అన్నీ పాటిస్తూ కళాశాలలను, పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం ప్రయివేటు విద్యాసంస్థలను ఆదేశించింది.