వరస అరెస్ట్ లతో
ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 13 మంది నిందితులను [more]
ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 13 మంది నిందితులను [more]
ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 13 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఏసిబి శుక్రవారం తాజాగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించింది.. గతంలో అరెస్ట్ చేసిన వెంకటేశ్వర్ హెల్త్ కేర్ ఎండీ ముకుంద్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంది.. మరోవైపు ప్రయివేట్ హస్పిటల్స్ పాత్ర పై ఏసిబి కూపి లాగుతుంది.
దూకుడు పెంచిన ఏసీబీ….
రాష్టంలో తీవ్ర దుమారం రేపుతున్న ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏసిబి దుకుడు పెంచింది.. ఇప్పటి వరకు ఈ స్కామ్ లో 13 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఏసిబి తాజాగా నేడు మరో ముగ్గురిని అరెస్ట్ చేయ్యడంతో అరెస్ట్ ల సంఖ్య 16 కు చేరింది.. వీరిలో ప్రధానంగా తేజ ఫార్మా ఎండి రాజేశ్వర్ రెడ్డి, చర్లపల్లి డిస్పెన్సరీ ఫార్మాసిస్ట్ లావణ్య,వరంగల్ జేడీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పాషాలను అరెస్ట్ చేసింది ఏసీబీ.. అరెస్ట్ అయిన తేజా ఫార్మా ఎండీ రాజేశ్వర్ రెడ్డి 28 కోట్ల రూపాయల మందుల కొనుగోళ్ల అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలు సేకరించింది ఏసీబీ, మరోవైపు ప్రయివేట్ హస్పిటల్స్ కు చర్లపల్లి డిస్పెన్సరీల నుంచి లావాణ్య మందులు సరఫరా చేసినట్టు ఏసిబి గుర్తించింది..పాషా మాత్రం మందులు తరలించడంలో కీలక పాత్ర వహించినట్టు ఏసిబి వివరాలు సేకరించింది.గతంలో అరెస్ట్ అయిన వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండి ముకుంద్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ముగ్గురు నిందితులను ఏసిబి అధికారులు అరెస్ట్ చేసారు..ఈ కేసులో ఇప్పటి వరకు 16 మంది నిందితులను ఏసిబి అరెస్ట్ చేసింది. దేవికారాణీతో పాటు జాయింట్ డైరెక్టర్, సీనియార్ అసిస్టెట్, ఫార్మాసిస్టులు, ఈఎస్ఐ సిబ్భందిని రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఏసిబి కీలక ఆధారాలు సేకరించింది. రెండు రోజుల పాటు విచారించిన ఏసిబి స్టేట్ మెంట్ ను రికార్డు చేసింది ఏసీబీ.. మందుల కొనుగోళ్ల లో జీవో 51 ను ఎందుకు పాటించకుండా అక్రమంగా ప్రయివేట్ హస్పిటల్స్ కు పెద్ద ఎత్తున మందులు సరఫారా చేసినట్టు ఏసిబి ఆధారాలు సేకరించింది.దీంతో పాటు గడిచిన నాలుగేళ్ళ లో నిందితుల ఆస్తుల వివరాలు వారి బినామిల పై ఏసీబీ కూపీ లాగింది.
పెద్దయెత్తున అక్రమాలు…..
నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు.. హెల్త్ క్యాంపుల పేరుతో మందులు, కిట్లు కోనుగోళ్లు చేసి వాటిన ప్రయివేట్ , బ్లాక్ మార్కెట్ కు అక్రమంగా తరలించినట్లు ఏసిబి అధికారులు గుర్తించారు.. ప్రయివేట్ హస్పిటల్స్ కు చెందిన ఏజెన్సీలకు సంబంధించిన వివరాలపై ఏసిబి ఆరా తీస్తుంది.. మరోవైపు ఈఎస్ఐ టోండర్లు పోందిన ప్రయివేట్ ఫార్మా కంపెనీలకు సంబంధించిన ఎండీలను, ఉద్యోగులను సైతం ఏసిబి విచారిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల లో మరోవైపు ఏసిబి సోదాలు నిర్వహిస్తుంది. డిస్పెన్సరీలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఏసిబి గుర్తించింది. మొదటి నుంచి ఫార్మాసిస్టులు, వివిధ ప్రైయివేట్ వ్యక్తుల మెడికల్ ఎజెన్సీల పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.. వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండీ ముకుంద్ రెడ్డి అరెస్టు అవ్వడం కీలక డాక్యూమెంట్లు లభ్యం కావడంతో వాటి ఆధారాంగా మరికోంత మందిని ఈ కేసులో ఏసిబి అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం చేస్తుంది. డాక్యూమెంట్ల వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ పాత్ర పై ఏసిబి ఆరా తీస్తుంది.. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఏసిబి అధికారులు ఈ కేసులో మరికోంత మందిని అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 16 మందిని ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టైన వారి స్టేట్మెంట్., కస్టడీలో నిందితులు ఇచ్చిన వివరాలతో మరి కొంత మంది అరెస్టుకు రంగం సిధ్దం చేసినట్లు తెలుస్తోంది. నిందితులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, కాల్ లిస్టు,డాక్యూమెంట్ల ఈ కేసులో కీలకంగా మారనున్నట్లు సమాచారం.