డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నాటి హష్‌మనీ కేసులో ఆయనపై మన్‌హటన్ కోర్టులో 30 అభియోగాలు నమోదయ్యాయి. నిన్న మధ్యాహ్నం ఆయన కోర్టులో లొంగిపోయారు. కోర్టుకు వచ్చిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా చరిత్రలోనే ఒక అమెరికా మాజీ అధ్యక్షడు అరెస్టవ్వడం ఇదే తొలిసారి. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బరిలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ కావడం సంచలనమే.
నటితో గడిపారన్న...
2006లో లేక్‌తాహో హోటల్‌లో స్టార్మీ డేనియల్స్ అనే నటితో గడిపారన్న ఆరోపణలను ట్రంప్ ఎందుర్కొంటున్నారు. స్వయంగా డేనియల్స్ ఈ విషయాన్ని బయటకు చెప్పడంతో ఆమెకు డబ్బులిచ్చి 2016 ఎన్నికల సందర్భంగా ఆమెను మౌనంగా ఉండేలా చేయగలిగారు. ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది కోహెన్ ద్వారా డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు అందచేసినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. దీనిని న్యాయవాది కూడా నిర్ధారించారు. దనిపై అమెరికా కాలమన ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ట్రంప్ అరెస్ట్ బయటకు వచ్చింది. ట్రంప్ అరెస్ట్ వార్తను తెలిసిన వెంటనే ఆయన అభిమానులు కోర్టు ఎదుట ఆందోళనకు దిగారు.
అది అవాస్తవం...
అయితే తాను ఏ పాపం చేయలేదని కోర్టులో లొంగిపోయిన ట్రంప్ తెలిపారు. డేనియల్‌ను కలిసిన మాట వాస్తవమేనని, కానీ ఆమెతో లైంగిక సంబంధాలు లేవని కోర్టులో వాదించారు. కోహెన్ వాంగ్మూలాన్ని కూడా ట్రంప్ ఖండించారు. తనకు ఏ పాపం తెలియదని, తనను ఇరికించేందుకు ఈ కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించినట్లు తెలిసింది. తనను దోషిగా ప్రకటించవద్దని న్యాయమూర్తిని ట్రంప్ కోరారు.