బొల్లినేని ఇంటరాగేషన్ మొదటి రోజు ఇలా?
జీఎస్టీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీని సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో పాటు లంచం తీసుకుంటున్న కేసును కూడా సీబీఐ [more]
జీఎస్టీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీని సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో పాటు లంచం తీసుకుంటున్న కేసును కూడా సీబీఐ [more]
జీఎస్టీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీని సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో పాటు లంచం తీసుకుంటున్న కేసును కూడా సీబీఐ నమోదు చేసింది. దీనిపై విచారణ కోసం న్యాయస్థానం ఈ నెల 4వ తేదీ వరకూ అనుమతించింది. చంచల్ గూడ జైలులో ఉన్న బొల్లినేని శ్రీనివాస్ గాంధీ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో మొదటి రోజు అధికారులు ప్రశ్నించారు. బొల్లినేని శ్రీనివాస్ గాంధీ అమరావతిలోనూ పెద్దయెత్తున భూములు కొనుగోలు చేశారు. దాదాపు 200 కోట్ల ఆస్తులున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై మొదటి రోజు సీబీఐ అధికారులు విచారించినట్లు తెలిసింది