డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి?

డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేయాలంటూ సీబీఐని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ఆదేశించింది . 8 వారాల్లో ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ సిబీఐని [more]

Update: 2020-05-22 07:41 GMT

డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేయాలంటూ సీబీఐని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ఆదేశించింది . 8 వారాల్లో ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ సిబీఐని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక పైన నమ్మకం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది . దీని వెనుక కుట్ర ఉన్నదన్న అనుమానాలు బలపడుతున్నాయ ని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. దాడికి పాల్పడిన పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలంటూ పేర్కొంది. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పైన హైకోర్టు సమగ్రంగా విచారణ జరిపింది. దీంట్లో ప్రభుత్వ అధికారులను హైకోర్టు తీవ్ర స్థాయిలో తప్పు పట్టింది. సీబీఐ దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. 8 వారాల్లో దీని పైన నివేదిక ఇవ్వాలంటూ పేర్కొంది

Tags:    

Similar News