చేయి తిరిగింది...టాప్ ఆర్డర్ కుప్పకూలింది
రెండో ఇన్నింగ్స్ లోనూ భారత్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు.
నాగపూర్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లోనూ భారత్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. ఈ సారి కూడా స్పిన్నర్లదే పై చేయి అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లోనూ తడబాటు పడటంతో 64 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది.
అశ్విన్ దెబ్బకు...
ఇందులో రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు తీయగా, జడేజా మరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 223 పరుగల ఆధిక్యంలో ఉంది. వరసగా వికెట్లు టప టపా పడిపోతుండటంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు బిక్కమొహ వేశారు. దీంతో నాగ్‌పూర్ టెస్ట్ లో భారత్ విజయం దిశగా పయనిస్తుంది. టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చివేయడంతో భారత్ విజయం పెద్ద కష్టమేమీ కాదని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.