విషాదం.. తవ్వేకొద్దీ శవాల గుట్టలు
తుర్కియా, సిరియాలలో ఇంకా శిధిలాల కొనసాగింపు కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి.
తుర్కియా, సిరియాలలో ఇంకా శిధిలాల కొనసాగింపు కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఎన్నడూ ఇంతటి విపత్తును చూడలేదని అధికారులు కూడా చెబుతున్నారు. గత ఆరు రోజుల నుంచి కొనసాగుతున్న సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇరవై మూడు వేల మంది భూకంపం కారణంగా మరణించారు. శిధిలాల తొలగింపు కష్టసాధ్యంగా మారింది. కొందరిని ప్రాణాలతో రక్షిస్తుండగా, మరికొందరు మృతదేహాలను వెలికి తీసి సామూహిక ఖననం చేస్తున్నారు.
1990 తర్వాత...
తవ్వే కొద్దీ శిధిలాల కింద నుంచి మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. 1990 తర్వాత ఇంతటి పెద్ద విపత్తును చూడలేదంటున్నారు. అనేక మంది గాయాలపాలయ్యారు. దాదాపు ఎనభై వేల మంది గాయాలపాలై ఆసపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లక్షల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. సహాయక బృందాలతో పాటు వైద్య సిబ్బందిని, ఔషధాలను పంపాయి. ఇక ఇతర దేశాల నుంచి సహాయక బృందాలు వచ్చి సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. శిధిలాలను పూర్తిగా తొలగిస్తేనే తప్ప ఎంత మంది చనిపోయారన్నది ఖచ్చితంగా తెలిసే అవకాశం లేదు.