బ్రేకింగ్ : రెండు వేల కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో దాదాపు రెండు వేల కోట్ల ఆస్తులు బయటపడ్డాయని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు తెలుగు [more]

Update: 2020-02-13 14:29 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో దాదాపు రెండు వేల కోట్ల ఆస్తులు బయటపడ్డాయని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు ఇన్ ఫ్రా కంపెనీల్లో గత ఐదు రోజులుగా జరిపిన దాడుల్లో అక్రమ ఆస్తులను గుర్తించామన్నారు. ఒక ప్రముఖ వ్యక్తి ప్రయివేటు సెక్రటరీ ఇళ్లపై జరిపిన దాడుల్లోనూ కీలకమైన సాక్ష్యాలు లభించాయని ఐటీ శాఖ తెలిపింది. కొన్ని కోట్లు విదేశాలకు మళ్లించినట్లు తెలిసిందన్నారు. చాలా షెల్ కంపెనీల నుంచి నిధులు మళ్లించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఈ దాడుల్లో 85లక్షల నగదు, 75 లక్షల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆర్.కె. ఇన్ ఫ్రా, ఆర్ కె కంపెనీలు పెద్దయెత్తున అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించామన్నారను. బోగస్ కంపెనీల పేర్లతో లావాదేవీలు నిర్వహించారన్నారు. 2 లాకర్లను ఓపెన్ చేశామని తెలిపారు. మొత్తం 40 చోట్ల ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించామని చెప్పారు. విశాఖ, విజయవాడ, కడప, ఢిల్లీ, హైదరాబాద్ , పూణె తదితర ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు ఐటీ శాఖ తెలిపింది.

Tags:    

Similar News