Breaking : ఇండియా సూపర్ విక్టరీ

భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ సునాయాసంగా గెలిచింది.;

Update: 2023-02-19 08:19 GMT

భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ సునాయాసంగా గెలిచింది. మూడో రోజు ఆటలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. 115 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ అధిగమించింది. నిన్న 61 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఈరోజు 52 పరుగులకే ఆల్ అవుట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో మూడో రోజు కేవలం 52 పరుగులకే అన్ని వికెట్లను సమర్పించుకుంది. భారత స్పిన్నర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. ఎక్కువ సేపు కర్ీజులో నిలడలేదు. రవీంద్ర జడేజా ఏడు వికెట్లు తీసుకుని ఆసీస్ బ్యాటింగ్ ను మరోసారి కుప్ప కూల్చాడు. మిగిలిన మూడు వికెట్లను అశ్విన్ తీసేసి ఆల్ అవుట్ చేసేశాడు.

నిలకడగా ఆడితేనే..
దీంతో మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన భారత్ 74 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అవుటయ్యారు. రోహిత్ రన్ అవుట్ కావడం విశేషం. కొహ్లి 20 పరుగులు చేసి వికెట్ కీపర్ కు దొరికిపోయాడు. విరాట్ తక్కువ పరుగులకే అవుట్ కావడం ఫ్యాన్స్ ను నిరాశపర్చింది. అనంతర వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా తక్కువ పరుగులకే అవుటయ్యాడు. దీంతో నాలుగు వికెట్లు కోల్పోయినట్లయింది.  పుజారా, భరత్ లు మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయడంతో భారత్ విజయం ఖాయమయిపోయింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భారత్ 2 -0తో అగ్రస్థానంలో ఉంది. పుజారా అత్యధికంగా 31 పరుగులు చేశాడు. ఒక రన్ చేాయాల్సి ఉండగా పూజారా ఫోర్ కొట్టి భారత్ కు విజయం తెచ్చి పెట్డాడు.


Tags:    

Similar News