Breaking : ఇండియా సూపర్ విక్టరీ

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది;

Update: 2023-02-11 08:53 GMT

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. 132 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. భారత్ బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు విలవిలలాడి పోయారు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాా 177 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ 400 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆస్ట్రేలియా కంటే 223 పరుగుల ఆధిక్యతను సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో భారత్ స్పిన్నర్లు రఫ్ ఆడించారు.

రఫ్ ఆడించారు....
ఆస్ట్రలియాను 91 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. దీంతో భారత్ విజయం ఖాయమయింది. రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు, జడేజా రెండు వికెట్లు తీసి ఆసీస్ కోలుకోలేని దెబ్బతీశారు. అక్షరపటేల్ ఒకటి, షమి రెండు వికెట్లు తీశారు. అప్పటికే పీకల్లోతు కష్టాల్లో పడిపోయిన ఆస్ట్రేలియా చివరకు చేతులెత్తేసింది. స్మిత్ చివర వరకూ పోరాడినా ఫలితం లేదు. బోర్డర్ - గవాస్కర్ తొలి టెస్ట్ ను భారత్ గెలుచుకుంది. దీంతో 1 - 0 తో టెస్ట్ సిరీస్ లో భారత్ ఆధిక్యంలో కొనసాగుతుంది.


Tags:    

Similar News