పోచారంపై ప్రశంసల జల్లు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు పోటీకి నిలబడకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. ప్రోటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ [more]

Update: 2019-01-18 06:21 GMT

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు పోటీకి నిలబడకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. ప్రోటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్.. స్పీకర్ గా పోచారం ఎంపికైనట్లు ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్, బలాలా తదితరులు ఆయనను స్పీకర్ పీఠంపై కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… రాజకీయంగా, వ్యక్తిగతంగా విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి అని తెలిపారు. వ్యవసాయ మంత్రిగా గత క్యాబినెట్ లో ఆయన చేసిన సేవలు అమూల్యమైనవన్నారు. ఆయన పేరును నిలిపేలా వ్యవసాయ శాఖ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. స్పీకర్ ఎన్నికల ఏకగ్రీవమయ్యేందుకు సహకరించిన కాంగ్రెస్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ తరపున గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ… ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా పోచారం సింప్లిసిటీతో ఉంటారన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… కేటీఆర్ నిత్య విద్యార్థి అని, ఆయన సహచరులుగా తామంతా ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం పనిచేసిన నాలుగున్నరేళ్లు తెలంగాణ రైతులకు స్వర్ణ యుగం వంటిదని మంత్రి హరీష్ రావు కితాబిచ్చారు.

Tags:    

Similar News