కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

కాంగ్రెస్ పార్టీ తన పనితీరు మార్చుకోకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అది భారతయీ జనతా పార్టీ కావచ్చు [more]

Update: 2020-03-06 12:36 GMT

కాంగ్రెస్ పార్టీ తన పనితీరు మార్చుకోకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అది భారతయీ జనతా పార్టీ కావచ్చు లేదా సొంత పార్టీ అయినా కావచ్చని కోమటిరెడ్డి అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజే ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ రెండు సార్లు పొరపాటు చేసిందని, ఇప్పుడైనా పీసీీసీ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోమటిరెడ్డి కోరారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు అవసరమైతే సొంత పార్టీని పెట్టేందుకు కూడా తాను వెనకాడబోనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పీసీసీ చీఫ్ పదవికి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ పడుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News