శవ రాజకీయాలను ఆపండి

శవాలను అడ్డంపెట్టుకుని తండ్రీకొడుకులు రాజకీయాలు చేద్దామని చూస్తున్నారని మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని పక్క దారి పట్టించేందుకే దళిత [more]

Update: 2021-08-17 12:28 GMT

శవాలను అడ్డంపెట్టుకుని తండ్రీకొడుకులు రాజకీయాలు చేద్దామని చూస్తున్నారని మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని పక్క దారి పట్టించేందుకే దళిత యువతి మరణాన్ని రాజకీయం చేయాలని చూశారని కొడాలి నాని మండి పడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లకుండా చిల్లర చేష్టలు చేస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఓటమి పాలయిన లోకేష్ కు ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరే స్థాయి లేదని కొడాలి నాని అన్నారు. మహిళపై దాడులు జరగకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని కొడాలి నాని చెప్పారు.

Tags:    

Similar News