Kodali nani : చంద్రబాబు పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసనలు ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర చేస్తారు కాని, ప్రయివేటు పెట్రోలు బంకుల [more]

Update: 2021-11-09 05:50 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసనలు ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర చేస్తారు కాని, ప్రయివేటు పెట్రోలు బంకుల వద్ద చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు వయసు వచ్చినా బుద్ధి రాలేదన్నారు. పెట్రోలు బంకుల దగ్గర అసాంఘిక శక్తులు జొరబడి విధ్వంసం సృష్టించి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్దతీయాలన్న కుట్రలను చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. పెట్రోలు, డీజిల్ పోసి చంద్రబాబును తగలబెడితే కాని ఈ రాష్ట్రం బాగుపడదన్నారు. చంద్రబాబు తన పరిపాలనలో పెట్రోలు, డీజిల్ పై రెండురూపాయలు సర్ ఛార్జి విధించారని కొడాలి నాని అన్నారు.

భ్రమల్లో బీజేపీ నేతలు…

బీజేపీ నేతలు భ్రమల్లో ఉన్నారని కొడాలి నాని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని నాని ఆరోపించారు. పెట్రోలు ధర ప్రభావం బీజేపీ పై పడుతుందని చంద్రబాబు కంగారు పడుతున్నారన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీని ప్రజలు పెట్రోలు పోసి తగలపెట్టారని కొడాలి నాని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెట్టాల్సిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి అంటగడుతున్నారన్నారు.

Tags:    

Similar News