బ్రేకింగ్ : బాబుపై కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్లే ఓటమి పాలయ్యామని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి నుంచి టీడీపీతో పొత్తు [more]

;

Update: 2019-01-05 12:32 GMT
komatireddy venkatareddy shocking comments on tdp
  • whatsapp icon

తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్లే ఓటమి పాలయ్యామని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి నుంచి టీడీపీతో పొత్తు వద్దని కోరుతున్నానని చెప్పారు. చంద్రబాబు ప్రచారం చేయడంతో ఉద్యోగులు, యువత కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణలో చంద్రబాబు పెత్తనం చేస్తారన్న కేసీఆర్ ప్రచారాన్ని ప్రజలు బలంగా నమ్మారన్నారు. లేకుంటే కనీసం 45 స్థానాల్లో గెలిచే వాళ్లమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పోత్తులతోనే నష్టపోయమాన్నరాు. టీడీపీకి కేడర్ నామమాత్రమయిందన్నారు. నల్లగొండ పార్లమెంటు నుంచి తాను పోటీచేస్తానని చెప్పారు. పార్లమెంటు ఎన్నికలలో పొత్తులు పెట్టుకోవద్దని అగ్రనేతలకు చెప్పానన్నారు. పొత్తులు లేకుంటే కనీసం ఏడు పార్లమెంటు స్థానాలను గెలుస్తామన్న ధీమాను కోమటిరెడ్డి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News