ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2018-12-08 11:00 GMT

రాష్ట్రంలో కచ్చితంగా 100 సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందని, ఓటింగ్ శాతం పెరగడమే దీనికి సంకేతని టీఆర్ఎస్ నేత కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ... ఓటింగ్ శాతం పెరగడం ప్రభుత్వానికి సానుకూల అంశమని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు చేసిన రోజు కేసీఆర్ ఏం చెప్పారో అదే జరగబోతుందని, ప్రత్యర్థులు ఎన్ని కూటములు కట్టినా, కుట్రలు చేసినా ముందుగా చెప్పినట్లుగా 100 సీట్లు గెలవబోతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీల్లాంటి నాయకులు ఓడిపోనున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రత్యర్థులు కుంటిసాకులు వెతుక్కుంటూ ఓటమిని అన్యోపదేశంగా అంగీకరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

బాబు పొత్తుతో వారికి అపారనష్టం...

చంద్రబాబు తిరగడం వల్ల మహాకూటమికి అపార నష్టం జరిగిందని, వారిది అపవిత్ర పొత్తని తెలంగాణ ప్రజలు గ్రహించారన్నారు. అది గుర్తించే చివరి రెండు రోజులు చంద్రబాబు ఫోటో లేకుండా పత్రికా ప్రకటనలు ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయడు, వందల కోట్లు అన్ని వృధా అయ్యాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ దెబ్బకు లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే రాజకీయ సన్యాసం చేశారని, ఈసారి సర్వేల సన్యాసం కూడా తీసుకుంటారని ఎద్దేవా చేశారు.

Similar News