10July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
హైదరాబాద్ పోలీసు విభాగంలో ప్రత్యేక పోలీసు అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు అధికారుల నుండి తాత్కాలిక ప్రాతిపదికన 120 ప్రత్యేక పోలీసు అధికారుల పోస్టుల కోసం హైదరాబాద్ సిటీ పోలీసు యంత్రాంగం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Police Jobs: స్పెషల్ పోలీసు ఆఫీసర్ ఉద్యోగాలు.. షరతులు ఇవే!!
హైదరాబాద్ పోలీసు విభాగంలో ప్రత్యేక పోలీసు అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు అధికారుల నుండి తాత్కాలిక ప్రాతిపదికన 120 ప్రత్యేక పోలీసు అధికారుల పోస్టుల కోసం హైదరాబాద్ సిటీ పోలీసు యంత్రాంగం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సందీప్ కిషన్ రెస్టారెంట్ లో తనిఖీలు.. ఏమేమి బయటపడ్డాయంటే?
తెలుగు హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ బిజినెస్ లో ఉన్న సంగతి తెలిసిందే. 'వివాహ భోజనంబు' పేరుతో రెస్టారెంట్ ను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఆయన రెస్టారెంట్ పై ఇటీవల అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందులో అనేక ఆహార భద్రత ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.
వీహెచ్ ఈ డిమాండ్ ను అయినా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకుంటారో.. లేదో!!
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు కాంగ్రెస్ పార్టీ ముందు మరో డిమాండ్ ను ఉంచారు. గత కొన్నేళ్లుగా తనకు ఎలాంటి పదవీ ఇవ్వలేదని.. ఇప్పుడైనా తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. లోక్ సభ ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినన్నారు.
Indian 2: భారతీయుడు-2 సినిమా విడుదల ఆపాలంటూ డిమాండ్
కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన 'ఇండియన్ 2' చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ చిత్రంపై నిషేధం విధించాలని కోరుతూ కేసు నమోదైంది. 'వర్మ కలై' [కేరళకు చెందిన మార్షల్ ఆర్ట్] ప్రధాన ఉపాధ్యాయుడు ఆసన్ రాజేంద్రన్ కమల్ హాసన్‌కు భారతీయుడు-1 సినిమా కోసం శిక్షణ ఇచ్చారని తెలిపారు. రెండో సినిమాలోనూ తన మెళకువలు ఉపయోగించారని..
తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియా వేదికగా కోట్ల రూపాయల ఖర్చు - పొలిటికల్ ప్రకటనలపై విశ్లేషణ
భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియకు మూలస్తంభమైన లోక్‌సభ ఎన్నికలు, కఠినమైన రాజకీయ ప్రచారానికి, శక్తివంతమైన ఎన్నికల డైనమిక్స్‌కు దృశ్యకావ్యం. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం దేశం సిద్ధమవుతున్న సమయంలో, సాంప్రదాయక ఆన్-ది-గ్రౌండ్ ప్రచారాలు ఇంకా డిజిటల్ వ్యూహాల ప్రభావం కొత్త ఎత్తులకు చేరుకుంది.
Victor James: విక్టర్ జేమ్స్ రాజా.. ఇతడి దారుణాలకు తమిళనాడు షాక్
తమిళనాడులోని తంజావూరులో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడి, డబ్బు సంపాదించేందుకు వీడియోలు పోస్ట్ చేసినందుకు న్యాయస్థానం మంగళవారం పీహెచ్‌డీ స్కాలర్‌కి ఐదు జీవితకాల జైలు శిక్ష విధించింది. తమిళనాడుకు చెందిన పీహెచ్‌డీ స్కాలర్ విక్టర్ జేమ్స్ రాజా (35) ఈ దారుణాలకు పాల్పడ్డాడు.
గ్యాస్ కంపెనీ నుండి కాల్ చేస్తున్నామంటారు.. జర భద్రం!!
హైదరాబాద్, విజయవాడ, కాకినాడలో సేవలు అందిస్తున్న గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (BGL) పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. బీజీఎల్ పేరు,లోగోను దుర్వినియోగం చేస్తూ కొత్త స్కామ్ కు పాల్పడుతున్నారని.. వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది.
YSRCP: వెనక్కు తగ్గని వైసీపీ.. ఆ మాజీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిందిగా!!
వైసీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీలో చాలా మార్పులే వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఓటమి.. సొంత పార్టీ నేతలేనని తెలిసి ఏ మాత్రం తగ్గకుండా సస్పెండ్ చేస్తున్నారు. తాజాగా కదిరి నియోజకవర్గం విషయంలో వైసీపీ దూకుడైన చర్యలు తీసుకుంది.
పాల ట్యాంకర్ ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం
బుధవారం తెల్లవారుజామున లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మిల్క్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొనడంతో కనీసం 18 మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. బీహార్‌లోని సీతామర్హి నుంచి ఢిల్లీకి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గార్హా గ్రామ సమీపంలో పాల ట్యాంకర్‌ను బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆయన ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ డీజీగా ఆదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.