Hyderabad : హైదరాబాద్‌లో సెకండ్ హ్యాడ్ ఇళ్లకు పెరిగిన డిమాండ్

ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో సెకండ్ హ్యాండ్ ఇళ్లకు డిమాండ్ పెరిగింది

Update: 2024-10-17 05:37 GMT

ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో సెకండ్ హ్యాండ్ ఇళ్లకు డిమాండ్ పెరిగింది. కొత్త ఇళ్ల కంటే పాత ఇళ్ల కొనుగోలుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఇటీవల జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. ఇరవై ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లను కూడా కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. కొత్త ఇళ్ల కంటే పాత ఇళ్లనే కొనుగోలు చేసి ఆధునికీకరణ చేయించుకోవడం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. ప్రధానంగా సెకండ్ హ్యాండ్ అపార్ట్‌‌మెంట్లకు బాగా గిరాకీ పెరిగింది. కుటుంబాలు పెరిగిపోవడంతో ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం డబుల్ బెడ్ రూం ఇళ్లను కొనుగోలు చేసిన వారు ఇప్పుడు ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు.

పాత ఇళ్లను అమ్మకాలు...
దీంతో పాత ఇళ్లను సేల్స్ ను పెడుతున్నారు. కొందరు ఇరవై ఏళ్ల క్రితం కారు పార్కింగ్, లిఫ్ట్‌ వంటి సౌకర్యాలు లేకపోయినా నాడు కొనుగోలు చేసిన వారు. ఇప్పుడు వయసు మీదపడటంతో కారు కొనుక్కోవడంతో పార్కింగ్ అవసరం అవుతుంది. అలాగే లిఫ్ట్‌ కూడా అవసరమే. మెట్టు ఎక్కలేని పరిస్థితుల్లో తమ ఫ్లాట్లను అయిన కాడికి అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు. కొంత దూరమైనా అన్ని వసతులున్న ప్రాంతాలకు వెళ్లేందుకు వారు సిద్ధపడి తమ పాత ఇళ్లను అమ్మకాలు పెట్టారు. అనేక చోట్ల ఈ ఫ్లాట్ల అమ్మకాల బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో తక్కువ ధరతో పాటు తమకు స్థిర నివాసం ఏర్పడతుందన్న భావనతో ఇళ్లు లేని వారు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. కొందరు విదేశాలకు వెళుతూ విక్రయిస్తున్నారు.
నడిబొడ్డున తక్కువ ధరకు...
ఈ ఇరవై ఏళ్లలో హైదరాబాద్ నగరం బాగా విస్తరించింది. నగరం నడిబొడ్డున తక్కువ ధరకు కొత్త ఇళ్లు దొరికే పరిస్థితి లేదు. అందుకే సెకండ్ హ్యాండ్ ఇళ్ల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ప్రాంతాలను బట్టి రేటును బోర్డులు పెట్టి మరీ గృహ యజమానులు విక్రయానికి సిద్ధమయ్యారు. పాత ఇంటిని అమ్మిన సొమ్ముకు మరికొంత కలిపి కొత్త ఇల్లు, అని వసతులతో ఉండేది కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఈ పనికి పూనుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల ఇలాంటి ఇళ్ల వద్ద ఫర్ సేల్ బోర్డులు చాలా దర్శనమిస్తున్నాయి. వీటికి డిమాండ్ కూడా పెరగడంతో బ్రోకర్లు కూడా వీటిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి కమీషన్లు దండుకుంటున్నారు.
ఆఫీస్ స్పేస్ ఖాళీ...
మరోవైపు హైదరాబాద్ నగరంలో ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉన్నాయని లెక్కలు చెబుతను్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ ఎక్కువగా ఖాళీగా ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా వంటి సంస్థలు కూడా తెలిపాయి. ఆఫీస్ స్పేస్ దారుణంగా పడిపోయిందని చెబుతున్నారు పెద్ద పెద్ద కంపెనీలు సొంతంగా తమ కార్యాలయాలు నిర్మించుకోవడం, ఆఫీస్ అద్దె చెల్లించేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో కమర్షియల్ స్సేస్ చాలా ఖాళీగా ఉందని చెబుతున్నారు. ప్రధానంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ధరలు ఆకాశన్నంటడంతోనే వాటిని తీసుకోవడానికి సుముఖత చూపడం లేదు. గతంలో నామమాత్రంగా ఉన్న అద్దెలు ఒక్కసారిగా పెంచడంతో ఈ స్పేస్ ఎక్కువగా ఉందంటున్నారు.
Tags:    

Similar News