Gold Price Today : మహిళలకు మళ్లీ షాకింగ్ న్యూస్.. ఇలా పెరిగితే బంగారాన్ని కొనలేమేమో?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సీజన్ ప్రారంభం కాకముందే పసిడి, వెండి ధరలు అందకుండా పోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కొంచెం తగ్గుతూ, కొంచెం పెరుగుతూ పరవాలేదులే అనిపించి బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుండటంతో ముందుగానే ధరలు పెరిగి ఉసూరుమనిపిస్తున్నాయి. ఇంకా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. దీంతో ముందుగానే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. ముందుగా ఆభరణాలను ఆర్డర్ చేసుకున్న వారు కూడా పెరిగిన ధరలు చూసి షాక్ కు గురవుతున్నారు.
నిలకడగా ఉండవు...
బంగారం, వెండి ధరలు నిలకడగా ఉండవు. ప్రతిరోజూ వాటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో నిత్యం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇటీవల కాలంలో కొంత తగ్గినట్లే కనిపిసించినా మళ్లీ పసిడి పరుగు ప్రారంభించింది. వెండి కూడా దాదాపు అదే బాటలో పయనిస్తుంది. ఇక బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తాలను వెచ్చించాల్సి వస్తుందని, తమకు ఇష్టమైన ఆభరణాలను తాము పొందలేకపోతున్నామని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.
ఈరోజు ధరలు...
పసిడి, వెండి ధరలకు డిమాండ్ ఎప్పడూ తగ్గదు. పెరగడమే తప్పించి తగ్గడం అనేది సహజంగా ఉండదన్నది మార్కెట్ నిపుణుల అభిప్రాయం. అందుకే బంగారంపై పెట్టుబడి పెట్టాలని కోరుతుంటారు. ఇందులో మదుపు చేస్తే లాభమే తప్ప నష్టముండదన్న భరోసా వినియోగదారుల్లో ఉండటంతో కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత రెండు రోజుల నుంచి 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై 660 రూపాయలు పెరిగింది. వెండి ధరలు కిలోపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,610 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,120 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,03,100 రూపాయలుగా ఉంది.