14May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో చిట్ చాట్ చేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి రెండు గంటల వరకూ పోలింగ్ జరిగిందన్నారు. రాత్రి 12 గంటల వరకూ 78.25 పోలింగ్ శాతం నమోదయినట్లు ఆయన తెలిపారు. పోస్టల్ బ్యాలట్ లు 1.2 శాతం ఓట్లు పోలయ్యాయని చెప్పారు. అయితే ఈ రెండు కలుపుకుంటూ 81 శాతం నమోదయ్యే అవకాశముందని తెలిపారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
పోలింగ్ శాతం 80 దాటే అవకాశం : మీనా
రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో చిట్ చాట్ చేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి రెండు గంటల వరకూ పోలింగ్ జరిగిందన్నారు. రాత్రి 12 గంటల వరకూ 78.25 పోలింగ్ శాతం నమోదయినట్లు ఆయన తెలిపారు. పోస్టల్ బ్యాలట్ లు 1.2 శాతం ఓట్లు పోలయ్యాయని చెప్పారు. అయితే ఈ రెండు కలుపుకుంటూ 81 శాతం నమోదయ్యే అవకాశముందని తెలిపారు.
Ap Elections : విన్నారు.. కన్నారు..నొక్కారు.. లక్కు ఎవరి వైపు ఉన్నదంటే మాత్రం...?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినా.. ఎవరికి అధికారం అన్నది మాత్రం అంతుచిక్కకుండా ఉంది. పోలింగ్ శాతం మాత్రం భారీగా నమోదయింది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు జనం క్యూ కట్టారు. గతంలో ఏఎన్నికల్లో చూడని విధంగా అర్థరాత్రి దాటేంత వరకూ పోలింగ్ జరిగింది. ఇది ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది.చివరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఏజెంట్లు కూడా ఆ బూత్ లో తమ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
Hyderabad : బాధ్యతలేని హైదరాబాదీలు.. ఈసారి కూడా అంతేగా
హైదరాబాద్ వాసులు ఈసారి కూడా ఓటు వేయడానికి ముందుకు రాలేదు. ఎప్పటిలాగానే అతి తక్కువ పోలింగ్ శాతం హైదరాబాద్ లోనే నమోదు కావడం విశేషం. ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద కాస్త హడావిడిగా కనిపించినప్పటికీ తర్వాత పోలింగ్ కేంద్రాలన్నీ బోసి పోయి కనిపించాయి. కేవలం అలా వెళ్లి ఇలా ఓటు వేసి వచ్చే పరిస్థితి నెలకొంది. కొత్త ఓటర్లు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపలేదు.
Ap Leaders : ఫ్యామిలీ టైం... మిగిలిన కొద్ది సొమ్మును కొరుక్కుతింటారనే భయమా? లేదా? టెన్షనా?
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అంతా ఫలితాలపైనే టెన్షన్. కానీ ఫలితాల కోసం మరో ఇరవై రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గత మూడు నెలల నుంచి నేతలు టెన్షన్ పడ్డారు. దీంతో చాలా మంది నేతలు కొద్ది రోజుల పాటు ఫ్యామిలీ వెకేషన్ కు వెళుతున్నారు. కొందరు నేతలు ఎక్కవగా హైదరాబాద్ కు వచ్చేస్తున్నారు. మరికొందరు నేతలు ఊటీ, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రదేశాలకు వెళుతున్నారు.
BJP : తెలంగాణ నేతలకు కత్తి మీద సామే.. ఈసారి టార్గెట్ రీచ్ కాకపోతే మాత్రం?
తెలంగాణ బీజేపీ నేతలకు ఈ ఎన్నికలు కఠిన పరీక్ష. తెలంగాణ పై పార్టీ అధినాయకత్వం ఎన్నో హోప్ప్ పెట్టుకుంది. గత ఎన్నికల్లోనే నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. గత అసెంబ్లీలో కేవలం ఒక నియోజకవర్గం నుంచే కమలం పార్టీ గెలిచింది. కానీ ఈసారి అలా కాదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో మూడో అతి పెద్ద పార్టీగా అవతరించింది.
Madhavi Latha : పోలీసుల కేసులకు నేను భయపేడేది లేదు
హైదరాబాద్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి మాధవీ లత సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో తమకు అనుకూలమైన ఒకటిన్నర లక్ష ఓట్లను తీసివేశామన్నారు. తమ పార్టీకి ఓటు వేసేవారిని అడ్డుకున్నారని, పోలీసులకు చెప్పించినా పట్టించుకోలేదన్నారు. హిజాబ్ ధరించిన మహిళల నుంచి మర్యాదగా ఓటరు ఐడీ కార్డు అడిగి పరిశీలించామని తెలిపారు.
బాలుడిని చంపేసిందని పెంపుడు కుక్కను చంపిన కుటుంబ సభ్యులు
తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ఐదు నెలల పసికందుపై పెంపుడు కుక్క దాడి చేయడంతో ఆ బాలుడు మరణించాడు. తాండూరు పట్టణంలోని బసవేశ్వరనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పసికందుపై పెంపుడు కుక్క దాడి చేయడంతో ఆ బాలుడు మరణించడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు.
Narendra Modi : వారణాసిలో మోదీ నామినేషన్
చివరి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. మూడో సారి ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరసగా గెలిచిన మోదీ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. మోదీ నామినేషన్ సమర్పిస్తున్న సమయంలో ఆయన వెంట కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాధ్ సింగ్ తో పాటు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ తో పాటు పలువురు ఎన్డీఏ నేతలున్నారు.
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆరుగురి మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్ లోని బ్రజ్‌ఘాట్ టోల్ ప్లాజా వద్ద కారు ప్రమాదానికి గురైన ఘటనలో ఇంత మంది మరణించారు. టోల్ ప్లాజా వద్ద వేగంగా వచ్చిన కారు ఒక ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
Mumbai : గాలివానకు కూలిన హోర్డింగ్.. 14 మంది మృతి
ముంబయి నగరంలో గాలివాన బీభత్సం సృష్టించిది. భారీ హోర్డింగ్ కూలి పథ్నాలుగు మంది మృతి చెందారు. మరో 70 మందికి గాయాలయ్యాయని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ముంబయి నగరంలో గాలి వాన బీభీతత్సానికి పథ్నాలుగు మంది మరణించిన ఘటన విషాదం నింపింది. అయితే మృతులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.ముంబయిలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.