April17-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత తొలి శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయోధ్య వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీరామనవమి కావడం, రాముడి జన్మభూమి అని నమ్మికతో ఎక్కువ మంది భక్తులు విశేషంగా దేశం నలుమూలల నుంచి తరలి వచ్చారు.

Update: 2024-04-17 12:15 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Ayodhya : కిటకిటలాడుతున్న అయోధ్య.. లక్షల మంది రాకతో

అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత తొలి శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయోధ్య వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీరామనవమి కావడం, రాముడి జన్మభూమి అని నమ్మికతో ఎక్కువ మంది భక్తులు విశేషంగా దేశం నలుమూలల నుంచి తరలి వచ్చారు.

Ap Assembly Elections : రెండు పార్టీలకు ఆ సీట్లే కీలకం.. అక్కడ గెలవాలంటే కష్టమేనట మరి

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని నియోజకవర్గాలు కొన్ని పార్టీలకు పెట్టని కోటలు. అక్కడ ప్రత్యర్థులు గెలిచిన దాఖలాలు లేవు. ఎప్పుడు ఎంత బలంగా గాలి వీచినా సరే అక్కడ మాత్రం గెలుపు గుర్రం ఎక్కలేదు. అభ్యర్థులను మార్చినా.. అనేక అభివృద్ధి పనులు చేసినా.. సంక్షేమ పథకాలను అందించినా సరే ఆ నియోజజకవర్గాలు మాత్రం పార్టీలకు మాత్రం దక్కడం లేదు.

Pawan Kalyan : ఎంతో ఊహించుకున్నామయ్యా... చివరకు ఎమ్మెల్యేగా గెలిస్తే చాలన్న సీన్ తెచ్చావేమయ్యా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జనసైనికుల నుంచి సూటి ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఒకవైపు తాను జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తానని, ముఖ్యమంత్రిగా తొలిసంతకాన్ని వాలంటీర్ల వ్యవస్థను తిరిగి పునరుద్ధరించే ఫైలుపై పెడతానని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తాను జూన్ 4వ తేదీన నాలుగువేల రూపాయల పింఛను పై సంతకం చేస్తానని, వాటిని ఇంటి వద్దకు అందించేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

IPL 2024 : సమ ఉజ్జీలు పోటీ పడితే అంతే... నువ్వు వంద కొడితే.. నేను కొట్టలేనా?

అదే ఐపీఎల్ లో జరిగేది. సెంచరీ చేసి ఎక్కువ పరుగులు చేశామన్న ఆనందం ఆ జట్టులో పెద్దగా నిలవదు. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు కూడా అంతే బలమైనది. అందుకే గెలుపు అనేది చివరి వరకూ ఎవరిది అన్నది అంచనా వేయడం ఎవరికైనా కష్టమే. ఒక్కడు నిలదొక్కుకుంటే చాలు ఎంతటి భారీ స్కోరునయినా ఊదేస్తాడు.

Hyderabad: హైదరాబాద్ లో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అరెస్ట్.. డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ లో వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరి నుంచి 4.2 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌వోటీ పోలీసులు ఈ డ్రగ్స్ ను వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Ayodhya : భవ్యరామాలయంలో సూర్యకిరణాలు

అయోధ్యలో భక్తులు పులకించిపోయారు. బాలరాముడికి సూర్యతిలకం చూసి పరవశించిపోయారు. శ్రీరామనవమి సందర్భంగా బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడేలా అధునాతన టెక్నాలజీతో చేసిన కార్యక్రమం విజయవంతమయింది. బాలరాముడి నుదుటను తిలకం దిద్దినట్లు సూర్యకిరణాలు పడటంతో భక్తులు రామయ్యను చూసి భక్త పారవశ్యంలో మునిగిపోయారు.

Juvenile Home : జువైనల్ హోం నుంచి పిల్లలు పరారీ

జువైనల్ హోంలో ఉంటున్న చిన్నారులు పరారయిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. సూరారం పరిధిలోని కైలాస్ నగర్ లో ఉన్న జువైనల్ హోంలో పిల్లలు ఉన్నారు. అయితే అందులో ఎనిమిది మంది పిల్లలు ఈరోజు తప్పించుకున్నారని హోం నిర్వాహకులు సూరారాం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కాన్నారు.

Janasena : 24 మంది అభ్యర్థులకు నేడు బీఫారాల అందచేత

జనసేన పార్టీ అభ్యర్థులకు నేడు బీఫారాలను పార్టీ అధినేత పవన్ కల్యాణ‌్ అందచేయనున్నారు. ఈరోజు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో బీఫారాలను అందచేస్తారు. ఈ మేరకు ఖరాయిన అభ్యర్థులందరూ పార్టీ కార్యాలయానికి రావాలని కబురు పంపారు. రేపటి నుంచి నామినేషన్ల కార్యక్రమం ప్రారంభం కానుండటంతో ఈరోజు అభ్యర్థులకు బీఫారాలు అందచేయాలని పవన్ నిర్ణయించారు.

Hyderabad : నేడు హైదరాబాద్‌లో రాత్రి 12 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు.. అటుగా వెళ్లారంటే?

నేడు హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. శ్రీరాముడి శోభాయాత్ర జరుగుతున్నందున కొన్ని యాత్ర కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. సీతారాంబాగ్‌ నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది.

ఒంటిమిట్టలో నవమి వేడుకలు

నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 20న హనుమంత వాహనంపై రాములవారు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీరామనవమి వేడుకలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు.


Tags:    

Similar News