2 April-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఛత్తీస్‌గడ్ లోని బీజాపూర్ లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈరోజు ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి. వరసగా ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు మృతి చెందుతుండటంతో పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.

Update: 2024-04-02 13:53 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

బీజాపూర్ లో ఎన్ కౌంటర్ .. నలుగురు మావోల మృతి

ఛత్తీస్‌గడ్ లోని బీజాపూర్ లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈరోజు ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి. వరసగా ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు మృతి చెందుతుండటంతో పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.

KCR : ఆ రెండు పనులు చేయకుంటే.. బీఆర్ఎస్ మరింత బలహీనమవుతుందా?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లో మార్పును ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. గత పదేళ్లు వేరు. రానున్న ఐదేళ్లు వేరు. ఈ ఐదేళ్లు కష్టపడితేనే మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశముంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల చరిత్రను తిరగరాసే వీలుంది. 1995 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ రెండోసారి కూడా గెలిచింది. అంటే ప్రజలు పదేళ్ల పాటు ఒక ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లే కనపడుతుంది.

Ambati Rayudu : రాయుడు.. రాజకీయ మైదానంలో అలా వచ్చి ఇలా వెళ్లాడేంటి చెప్మా?

ఎన్నికల ముందు వరకూ హడావిడి చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎన్నికలు సమీపించే సమయంలో కనిపించకుండా వెళ్లిపోయాడు. అంబటి రాయుడు అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నాడు? ఎందుకు ఆగిపోయాడు? ఇది మనకు పడదు అని భావించాడా? ఏపీ రాజకీయాలపై విసుగుచెంది వెళ్లిపోయాడా? అన్నది మాత్రం తెలియరాలేదు.

Pawan Kalyan : పిఠాపురంలో పవన్ ఇంటింటికీ తిరుగుతూ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన ఇంటింటికీ తిరిగి గ్రామస్థులను పలకరిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా వారితో కూర్చుని వారికి ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి పవన్ కల్యాణ్ ఆరా తీశారు.

IPL 2024 : ఈరోజు ఐపీఎల్‌లో అదిరిపోయే మ్యాచ్

నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది. ఇప్పటి వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ మాత్రమే నెగ్గింది. రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ పై ఓటమి పాలయింది. పంజాబ్ కింగ్స్ మీద మాత్రమే విజయం సాధించింది.

KTR : వాళ్లను కోర్టుకు ఈడుస్తా.. కాచుకోండి ఇక

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తుంది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనేక మంది అధికారులు అరెస్టయ్యారు. కొందరిని కస్టడీకి తీసుకుని విచారిస్తుండగా, మరికొందరు జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు.

Janasena : గాజు గ్లాసు ఫ్రీ సింబల్ కావడంతో.. మొదలయిన కలవరం

జనసేన పార్టీకి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. జనసేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా చేస్తూ ప్రకటన చేసింది. జనసేన పార్టీని ఎన్నికల కమిషన్ కేవలం రిజిస్టర్ పార్టీగానే గుర్తించింది. అందుకే గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే?

ఆంధప్రదేశ్‌లో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 11వ తేదీ వరకూ వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో వెల్లడించింది.

కాకతీయుల శిల్పాలను కాపాడుకోవాలి

800 సంవత్సరాల నాటి కాకతీయుల శిల్పాలపై రంగుల వేసి ప్రాచీనతకు భంగం కలిగించవద్దని, రంగులు తొలగించి కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, ఈమని శివనాగిరెడ్డి అన్నారు. మాల్ శివారులోనున్న గొడగండ్ల గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలోని సప్తమాతృకల శిలాఫలకం

IPL 2024 : పాండ్యాపై పగబట్టినట్లుందిగా.. కెప్టెన్సీ వదిలేయ్ సామీ

ఏ ముహూర్తంలో హార్ధిక్ పాండ్యా ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడో అప్పటి నుంచి అన్నీ పరాజయాలే. వరస విజయాలు వెంటాడుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ గా ఉన్నప్పుడు ఒకసీజన్ లో కప్పు కొట్టేశాడు. మరొక సీజన్ లో జట్టను ఫైనల్ కు చేర్చాడు.




Tags:    

Similar News