March22-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
సీనియర్ నటి రాధికకు బీజేపీ టిక్కెట్ కేటాయించింది. ఇటీవల శరత్ కుమార్ తన పార్టీని బీజేపీీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ ఎంపీ టికెట్ రాధిక శరత్ కుమార్ కు టిక్కెట్ ఇచ్చింది. విరుధునగర్ నుంచి ఆమె ఎంపీగా ఎన్నికల బరిలో నిలవనున్నారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
BJP : తమిళనాడులో పోటీకి దిగనున్న రాధిక.. బీజేపీ అభ్యర్థిగా
సీనియర్ నటి రాధికకు బీజేపీ టిక్కెట్ కేటాయించింది. ఇటీవల శరత్ కుమార్ తన పార్టీని బీజేపీీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ ఎంపీ టికెట్ రాధిక శరత్ కుమార్ కు టిక్కెట్ ఇచ్చింది. విరుధునగర్ నుంచి ఆమె ఎంపీగా ఎన్నికల బరిలో నిలవనున్నారు.
Breaking : కేజ్రీవాల్ అరెస్ట్ పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రౌస్ అవెన్యూకోర్టులో హాజరు పర్చారు. కేజ్రీవాల్ నుం పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. కేజ్రీవాల్ ను తమ కస్టడీకి అప్పగిస్తే మరిన్ని విషయాలను రాబట్టే అవకాశముంటుందని వారు తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్ పై ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు.
IPL 2024 : ఆట మొదలు కాకముందే.. ఫైనల్స్ కు జట్టు ఇవేనంటూ?
ఐపీఎల్ సీజన్ 17 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో విజేత ఎవరన్న దానిపై అనేక విశ్లేషణలు వినపడుతున్నాయి. అన్ని జట్ల పెర్‌ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ ఎవరు ఈసారి విజేత అన్న అంచనాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అనేక మంది మాజీ క్రికెటర్లు సయితం ఈసారి విజేతలపై జోస్యం చెబుతున్నారు.
Devara: 'దేవర' మూవీ సెట్స్ నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'దేవర'. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్ ని వాయిదా వేశారు. ప్రస్తుతం మూవీ టీం షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.
Telangana : ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
తెలంగాణలో ఇటీవల ఎన్నికయిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రత్యర్థులు వేసిన పిటీషన్లపై విచారించిన ధర్మాసనం ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. అఫడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినందుకు వారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Allu Arjun : అల్లు అర్జున్ ‘మైనపు విగ్రహం’ ఓపెనింగ్ అప్పుడే..
ప్రపంచ ప్రసిద్ధి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తమ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. అలాంటి మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తుండడంతో బన్నీ అభిమానులు తెగ సంబరపడిపోయారు.
MS Dhoni : వారెవ్వా.. నాలుగు పదుల వయసులో.. న్యూ లుక్ లో అదరగొట్టేశాడుగా?
ఎంఎస్ ధోనీ అంటే అదో క్రేజ్.. టీం ఇండియాలో అరంగ్రేటంతోనే అదరగొట్టేశాడు. కేవలం ఆటతోనే కాదు. లుక్ తోనే అందరినీ ఆకట్టుకున్నాడు. తొలుత టీం ఇండియాలో కనిపించిన ధోని జుట్టు వెనక వైపు వేలాడుతూ ఉండేది. దానిని చూసి మనమే కాదు.. అప్పట్లో పాక్ ప్రధాని ముషార్రాఫ్ కూడా ధోనీ స్టయిల్ కు ఫిదా అయ్యాడు.
Breaking : సుప్రీంకోర్టులో కవితకు దక్కని ఊరట
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఆమె పిటీషన్ పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం అక్రమమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Drugs : విశాఖ డ్రగ్స్ డీల్‌లో కీలక అంశాలివే...యాభై వేల కోట్ల విలువైన
విశాఖలో దొరికిన డ్రగ్స్ కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. విశాఖ పోర్టులో పట్టుబడ్డ ఇరవై ఐదు కేజీల డ్రగ్స్ విలువ యాభై వేల కోట్ల విలువ ఉంటుందని చెబుతున్నారు. దీంతో సీబీఐ అధికారులు ఈ డ్రగ్స్ ను బ్రెజిల్ నుంచి తెప్పించిన సంధ్యా కంపెనీ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కంటైనర్ సంధ్యా ఆక్వా కంపెనీ పేరు ఉండటంతో ఆ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు.
IPL 2024 : నేటి నుంచి ఐపీఎల్ .. కావాల్సినంత వినోదం
ఐపీఎల్ పదిహేడో సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. చెన్నై లోని చెపాక్ స్టేడియంలో ఈ సీజన్ ప్రారంభం కాబోతుంది. మొత్తం పది జట్లు ఈ సీజన్ లో కప్ కోసం పోరాడుతున్నాయి. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లతో కూడిన జట్లు అభిమానులు నెలల పాటు అలరించనున్నాయి. కెప్టెన్లు జట్లకు మారారు.