22May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది.సింగపూర్‌లో కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ KP.2 వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే దాని ప్రభావం దేశంలో లేదని చెప్పింది.

Update: 2024-05-22 12:41 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

భారత్ లో కొత్తవేరియంట్ ప్రభావం లేదు

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది.సింగపూర్‌లో కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ KP.2 వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే దాని ప్రభావం దేశంలో లేదని చెప్పింది.

Pinnelli : పిన్నెల్లి అరెస్ట్ తప్పదా? కౌంటింగ్ కు ముందే కటకటాల వెనక్కు వెళతారా?

మాచర్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆయనపై కేసు నమోదయింది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలో ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు.

TDP : కన్నా ను సైడ్ చేసిందెవరు? ఆయనంతట ఆయనే తప్పుకున్నారా? లేక తప్పించారా?

కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లికే పరిమితం చేశారు. లేదా ఆయనే అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు ఇష‌్టపడ లేదా? అన్నది ఇప్పుడు కాపు సామాజికవర్గంలో చర్చ జరుగుతుంది. కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ నేత. కాంగ్రెస్ లో సుదీర్థకాలం ఆయన ప్రయాణం సాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన మంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. గుంటూరు రాజకీయాలను శాసించారు. ఆయన గుంటూరు జిల్లాకే పరిమితమైన నేత కాదు.

కారు డోర్స్ లాక్ అయి.. చిన్నారి మృతి..ఎన్ని ఘటనలు జరిగినా?

ఆగి ఉన్న కారులో చిన్నారి వెళ్లి డోర్ లాక్ అవ్వడంతో మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఈ ఘటన కుటుంబంలో విషాదం నింపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం సాంబాయిగూడెంలో లో కల్నీష అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఆగి ఉన్న కారులోపలికి వెళ్లింది. అయితే కారులోపలకి చిన్నారి వెళ్లగానే డోర్లు లాక్ అయిపోయాయి. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవరూ గమనించలేదు.

Toll Fees : టోల్ ఫీజులు పెంచేశారు.. ఎప్పటి నుంచి అంటే?

దేశ వ్యాప్తంగా టోల్ ఛార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలిపింది. జూన్ 2వ తేదీ నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నట్లు పేర్కొంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ ఫీజులను నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా పెంచుతుంటుంది. రహదారుల నిర్వహణ కోసం ఈ ఛార్జీలను పెంచుతూ వస్తున్నారు. అయితే ఎన్నికలు ఉన్నందున టోల్ ఛార్జీలను మొన్నటి వరకూ పెంచలేదు. ఎన్నికల సంఘం ఆదేశాలతో టోల్ ఛార్జీల పెంపుదలను వాయిదా వేసింది.

Arogya Shri : నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈమేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అల్టిమేటం ఇచ్చింది. ప్రభుత్వానికి ఘాటు లేఖరాసి మరీ ఈరోజు నుంచి ఆరోగ్య శ్రీ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. గత ఏడాది ఆగస్టు నుంచి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయీలు చెల్లించపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ తెలిపింది. పదిహేను వందల కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వం ఆసుపత్రులకు బాకీ ఉందని లేఖలో తెలిపింది.

ఏసీపీ ఇంట్లో ఏసీబీ.. బయటపడిన నోట్ల కట్టలు.. స్థిరాస్థి పత్రాలు

హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును నేడు న్యాయస్థానంలో ఏసీబీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. నిన్నంతా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పెద్దయెత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న తెల్లవారు జామునుంచే ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పథ్నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి పెద్దయెత్తున నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడును ముంచెత్తిన వానలు.. రెడ్ అలెర్ట్‌ను ప్రకటించిన ప్రభుత్వం

తమిళనాడులో రెడ్ అలర్ట్ ను ప్రకటించారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడులోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వానలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. తమిళనాడులోని కన్యాకుమారి, టెన్ కాశీ, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకూడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు.

Revanth Reddy : తిరుమలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు స్థానిక రచన అతిధి గృహంలో బస చేశారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

Road Accident : బస్సు బోల్తా - డ్రైవర్ మృతి పదిమందికి గాయాలు

విజయవాడ జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఢీకొని ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. మరికొందరికి గాయాలయ్యాయి.విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు.



Tags:    

Similar News