March23-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
పి. గన్నవరం జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. నిజానికి పి. గన్నవరం సీటును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అక్కడి నుంచి మహాసేన రాజేష్ పోటీ చేస్తారని కూడా జాబితాలో పేరును ప్రకటించారు. అయితే అక్కడ రాజేష్ పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లడి కావడంతో తెలుగుదేశం పార్టీ పునరాలోచనలో పడింది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Breaking : మరో అభ్యర్థిని ప్రకటించిన పవన్.. టీడీపీ కేటాయించిన సీటు నుంచి
పి. గన్నవరం జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. నిజానికి పి. గన్నవరం సీటును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అక్కడి నుంచి మహాసేన రాజేష్ పోటీ చేస్తారని కూడా జాబితాలో పేరును ప్రకటించారు. అయితే అక్కడ రాజేష్ పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లడి కావడంతో తెలుగుదేశం పార్టీ పునరాలోచనలో పడింది.
Dates Benefits: ఉదయం ఖాళీ కడుపుతో 2 ఖర్జూరాలు తింటే అద్భుతమైన ప్రయోజనాలు
ఖర్జూరాలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తింటే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అంతేకాదు.. ఉదయం పరగడుపున ఖర్జూరాలను తినవచ్చు. దీంతో ఉదయం శరీరానికి వేగంగా శక్తి లభిస్తుంది. ఇది మనల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచేలా చేస్తుంది. బద్దకం సమస్యను కూడా తగ్గిస్తుంది.
Breaking : ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టును అరవింద్ కేజ్రీవాల్ తరుపున న్యాయవాదులు కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మొన్న రాత్రి అరెస్ట్ చేశారు.
Tax Savings: మార్చి 31 వరకే అవకాశం..ఇలా చేస్తే భారీగా పన్ను ఆదా చేసుకోవచ్చు!
ఆర్థిక సంవత్సరం ముగియనుంది. వీలైనంత ఎక్కువ పన్నును ఆదా చేసేందుకు అందరూ ప్లాన్ చేస్తున్నారు. ఆదాయపు పన్నును ఆదా చేయడానికి, ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద జీతం కలిగిన తరగతి పెట్టుబడి పెట్టండి. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.1.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
Breaking : కవిత కస్టడీ పొడిగింపు...లోతుగా విచారించాలని ఈడీ అభ్యర్థన
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న కల్వకుంట్ల కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు హాజరుపర్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మూడు రోజుల పాటు ఆమెను కస్టడీకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. ఈనెల ఇరవై ఆరోతేదీన ఆమెను కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది.
Anand Mahindra : మహీంద్ర మాట ఇచ్చాడంటే.. ఇచ్చిపడేస్తాడంతే
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే పరిణామాలకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. అంతే కాదు చిన్నా.. పెద్దా అని లేదు.. ఎవరినైనా ప్రశంసలతో ముంచెత్తి మంచి బహుమానం అందచేస్తారు. ఆయన మాటంటే మాటే. అందుకే ఆయన దృష్టిలో పడాలని కూడా అనేక మంది ఆరాటపడుతుంటారు. సోషల్ మీడియాలో తమ ప్రతిభను కనపర్చే అంశాలను పోస్టు చేస్తూ మహీంద్రా దృష్టి తమ వైపు పడాలని ప్రయత్నిస్తుంటారు.
IPL 2024 : చెన్నై విజయం అలవోకగా లేదు కానీ.. వారిద్దరూ ఉంటే చాలదూ?
ఐపీఎల్ తొలి మ్యాచ్ అభిమానులను అలరించింది. చెన్నెలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఐపీఎల్ అంటే అంతే మరి. విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడుతుంది. చివరకు చెన్నై పరమయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆదిలో బాగానే ఆడింది.
Rishabh Pant : పంత్ పట్టుబట్టి మరీ సాధించాడుగా.. మైదానంలోకి రావడంతో..?
పదిహేను నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ లో కుదురుకున్నాడు. బ్యాటింగ్ లో విఫలమయినా వికెట్ల వెనక మాత్రం గతంలో మాదరిగానే పంత్ కనిపించడం అభిమానులకు ఊరటనిచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే రిషబ్ పంత్ మాత్రం పద్దెనిమిది పరుగులకే వెనుదిరిగాడు.
Chandrababu : అరుదైన రికార్డుకు చేరువలో చంద్రబాబు.. దానిపైనే గురి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం పర్యటన ఖరారయింది. ఈ నెల 26, 27 తేదీల్లో ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముందు ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు అరెస్ట్
కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల గ్రామంలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదు చేశారు. భూ కబ్జా కేసులో కూరుకుపోయిన కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు.